పవన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

CineJosh news

పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాను కొన్న బయ్యర్లు, పంపిణీదారులు నష్టపోయిన జాబితా బయటకు వస్తోంది. సుమారుగా అన్ని ఏరియాల్లో సగం వసూళ్లు మాత్రమే వచ్చాయి. నైజాం ఏరియాలో ఇరవై కోట్లకు సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్ కు పది కోట్లు వసూళ్లు కూడా రాలేదు. వారి బాధల్ని అర్ధం చేసుకున్న పవన్ కళ్యాన్ ఇప్పుడు ఆ నష్టాల్ని భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం కాకపోయినా.. సగం డబ్బైనా ఇవ్వాలని భావించిన పవన్ తను చేయబోయే తదుపరి సినిమా ద్వారా నష్టాల్ని భర్తీ చేస్తానని మాటిచ్చాడట. దీని కోసం ఎస్.జె.సూర్యతో చేస్తోన్న సినిమాను అతి తక్కువ ఖర్చులో పూర్తి చేసి బ‌య్య‌ర్ల‌కు త‌క్కువ రేటుకే సినిమాను ఇవ్వడానికి పవన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా రెమ్యునరేషన్ విషయం కూడా పవన్ పెద్దగా పట్టించుకోవట్లేదని సమాచారం. 

pawan kalyan
s.j.surya
sardhar gabbar singh