పవన్‌, బన్నీల మధ్య పోటీ తప్పదా...?

CineJosh news

మొత్తానికి సంక్రాంతి వార్‌ పూర్తయింది. ఈ పండగకు పోటాపోటీగా అన్నట్లు ఇద్దరు నందమూరి హీరోలైన బాబాయ్‌ బాలకృష్ణ 'డిక్టేటర్‌'తో, అబ్బాయ్‌ ఎన్టీఆర్‌ల 'నాన్నకు ప్రేమతో' ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో నందమూరి అభిమానులు ఏ చిత్రానికి ఓటు వేయాలో అర్థం కాక డైలమాలో పడ్డారు. కాగా ఇప్పుడు సమ్మర్‌ వార్‌కు రంగం సిద్దం అవుతోంది. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈసారి మెగాహీరోలైన పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌', అల్లుఅర్జున్‌ నటిస్తున్న 'సరైనోడు' చిత్రాలు ఒకే నెలలో అందులోనూ ఒకే రోజున విడుదల చేయడానికి సిద్దం అయ్యారనే టాక్‌ మొదలైంది. 'సరైనోడు' చిత్రాన్ని ఏప్రిల్‌ 8వ తేదీన బన్నీ బర్త్‌డే కానుకగా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇక 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' విషయానికి వస్తే ఈ చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ కొందరు మాత్రం పవన్‌ కాస్త ఆలస్యంగా ఓ నెల గ్యాప్‌ తీసుకొని మే 6న వస్తాడని అంటున్నారు. మరి చివరకు ఎవరు ఏ తేదీన వస్తారో? అనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. 

allu arjun
sarainodu
pawan kalyan
sardhar gabbar singh
summer release