బన్నీ సినిమా స్టేటస్ ఇదే..!

CineJosh news

తాజాగా అల్లుఅర్జున్‌ సినిమాకి ఇంటర్వెల్‌ సీన్స్‌ను తెరకెక్కించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. నగర శివార్లలో వేసిన ఓ భారీ సెట్‌లో అల్లుఅర్జున్‌, శ్రీకాంత్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌లతో పాటు 1000మంది జూనియర్‌ ఆర్టిస్టుల మద్య రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. ఈ కాంబినేషన్‌లో గీతాఆర్ట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్‌ సీన్స్ కు ఎక్కువ ప్రాదాన్యం ఉంటుందని, రామ్‌లక్ష్మణ్‌, రవివర్మలతో పాటు కీచ మాస్టర్‌ నేతృత్వంలో ఓ పోరాటాన్ని షూట్‌ చేయనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి 'సరైనోడు' అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. ఈ చిత్రాన్ని అల్లుఅర్జున్‌ జన్మదినోత్సవం సందర్బంగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా రూపొందుతున్న ఈచిత్రంలో శ్రీకాంత్‌తో పాటు ఆది పినిశెట్టి కీలకపాత్రలను పోషిస్తున్నారు.

allu arjun
sarainodu movie
boyapati srinu
rakul preeth singh
srikanth