హవ్వా... స్వామికి మూడు కోట్లా?

CineJosh news

రామ్ చరణ్ ఎలాగైనా హిట్టు కొట్టాలి. ఆ హిట్టు కూడా అలా ఇలా కాదు, మెగా ఫ్యాన్స్ అందరూ బ్రూస్ లీని మరిచిపోయే రెంజులో కొట్టాలి. దీనికోసం మెగా ఫ్యామిలీ ఏం చేయడానికైనా సిద్ధమే. అందుకే రామ్ చరణ్ కోసం సెలెక్ట్ చేసిన తని ఒరువన్ తెలుగు రీమేక్ బాధ్యతలను మొత్తంగా అల్లు అరవింద్ మీద పెట్టేసాడు చిరంజీవి. త‌మిళ‌నాట సూప‌ర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమాను మన కోసం సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. కాకపోతే అక్కడ విల‌నుగా అర‌వింద్ స్వామి చేసిన న‌ట‌న సినిమా మొత్తానికే  హైలైటుగా నిలిచింది.అంత‌టి శక్తివంతమైన పాత్ర‌ను తెలుగులో కూడా అర‌వింద్ స్వామి చేతే  చేయించడానికి 

సర్వం సిద్ధం అయింది. ముందుగా మాధ‌వ‌న్, మంచు మనోజ్ అంటూ రకరకాల పేర్లు వినబడ్డా వీళ్లెవ్వ‌రూ అల్లు అరవింద్ గారికి న‌చ్చ‌లేదు. ఫైనలుగా అరవింద్ స్వామినే ఎంపిక చేసేందుకు అతన్ని కలిస్తే, మూడు కోట్ల పారితోషికం అడిగారని టాక్. ఈ అమౌంట్ చాలా ఎక్కువని తెలిసినా గత్యంతరం లేక, రామ్ చరణ్ ముందు నిలబడే సత్తా ఉన్న గట్టి పాత్ర కాబట్టి అరవింద్ గారికి అడ్వాన్స్ చెల్లించక తప్పలేదు. విలన్ ఆర్టిస్టు కోసమే ఇంతలా ఖర్చు చేసారంటే రేపు సురేందర్ రెడ్డి పెట్టించబోయే ప్రొడక్షన్ ఖర్చులు ఇంకే స్థాయిలో ఉంటాయో ఊహించుకోండి. వింటేనే డబల్ కిక్ ఎక్కట్లేదు.

aravind swamy
ram charan
thani oruvan
allu aravind