Advertisementt

మహేష్ ను హర్ట్ చేసిన సినిమా..!

Wed 16th Sep 2015 03:44 AM
mahesh babu,one nenokkadine,aagadu,sreemanthudu  మహేష్ ను హర్ట్ చేసిన సినిమా..!
మహేష్ ను హర్ట్ చేసిన సినిమా..!
Advertisement
Ads by CJ

శ్రీమంతుడుతో ఫుల్‌హ్యాపీగా ఉన్నా గతంలో చేసిన పొరపాట్లు ఇంకా తనని బాధిస్తునే ఉన్నాయని మహేష్‌ అంటున్నాడు. ముఖ్యంగా 1(నేనొక్కడినే), ఆగడు.. చిత్రాలు జీవితంలో మర్చిపోని జ్ఞాపకాలను మిగిల్చాయని చెబుతున్నాడు. 1 చిత్రం ప్రయోగాత్మకంగా తీశామని, అయితే సంక్రాంతికి విడుదల చేయాలనే తొందరలో సరిగ్గా ఎడిట్‌ చేయలేదని, లేదంటే మంచి ఫలితం వచ్చేదని అన్నాడు. 1 కంటే ఆగడు సినిమా పరాజయం పాలవ్వడమే మహేష్‌ను బాగా కృంగదీసిందట. తన నటనపై ఎప్పుడూ రానన్ని విమర్శలు ఈ సినిమాతో వచ్చాయని ఫీలవుతున్నాడు. కథల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయం ఆగడు సినిమాతో అర్థమైందని, ఇక మీదట ఇలాంటి పొరపాట్లు తానెప్పుడు చేయనని అంటున్నాడు. శ్రీమంతుడు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌ అంతా ఇంతా కాదని, మంచి కథలను ఎంచుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని ఈ చిత్రం ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ