కోన.. కోరిక తీరేనా?

Bruce lee ది ఫైటర్.. తో మెగా కాంపౌండ్లోకి దూరిపోయాడు రచయిత కోనవెంకట్. ఇప్పుడు పవన్కి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. కొంతకాలం నుండి పవన్ని ప్రసన్నం చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. తాజాగా పవన్ పుట్టినరోజు సందర్బంగా కోన గిప్ట్ ఇచ్చాడు. పవన్కళ్యాణ్పై ప్రత్యేకంగా పాట రూపొందించి, అభిమానులను ఆశ్యర్యపరిచాడు. కోన నిర్మాతగా తెరకెక్కిస్తున్న శంకరాభరణం సినిమాలో పవనిజంపై రూపొందించిన పాట ఉంటుంది. పాటను పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆన్లైన్ ద్వారా విడుదల చేశాడు కోన. పాటను వింటూ పవన్ ఫ్యాన్స్ సందడి చేసుకొంటున్నారు. పాట, సినిమా కనుక క్లిక్కయితే కోన కూడా పవన్ అభిమానుల మనసు గెలుచుకున్నట్లే. కాగా కోనవెంకట్కు తాను దర్శకునిగా పవన్తో సిసిమా చేసి ఎంట్రీ ఇవ్వాలనే కోరిక బలంగా ఉండటంతోనే ఆయన పవన్ మీద అంత దృష్టి పెట్టాడని అందరూ అంటున్నారు.

bruce lee
brucee lee the fighter
kona venkat
pawan kalyan
sankarabharanam