జెనీలియా కొత్త అవతారం!

టాలీవుడ్‌లో 'బొమ్మరిల్లు' బామగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ జెనీలియా ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. కాగా త్వరలో ఈ అమ్మడు నిర్మాతగా మారనుందని సమాచారం. ఈమె నిర్మాతగా ఓ మరాఠి చిత్రం రూపుదిద్దుకొనుంది. 'చత్రపతి శివాజీ' అనే హిస్టారికల్‌ మూవీతో ఆమె నిర్మాతగా మారనుంది. 100కోట్ల బడ్జెట్‌తో ఆమె ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీగా ఆమె భర్త రితీష్‌ దేశ్‌ముఖ్‌ నటించనున్నాడు. ఈ చిత్రాన్ని మరాఠితో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని ఆమె భావిస్తోంది. సో.. బొమ్మరిల్లు భామ నిర్మాతగా తన టేస్ట్‌ ఏమిటో చూపించడానికి రెడీ అవుతోంది. 

genelia
producer
rithesh deshmukh
chathrapathi sivaji
Advertisement
Advertisement