రజనీ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం!

ఇటీవల ఒక వారం గ్యాప్‌లో రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ స్టోరీలు అందించిన ' బాహుబలి, భజరంగీ భాయిజాన్‌' చిత్రాలు ఘనవిజయం సాధించి 500కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించడంతో ఇప్పుడు ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ రెండు విజయాలను చూస్తే అందులోని కథాబలాలేే చిత్రానికి బలమైన వెన్నెముకగా నిలబడ్డాయని చెప్పకతప్పదు. కాగా ఇటీవల ఓ వేడుకలో సౌత్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విజయేంద్రప్రసాద్‌కు కలిశారని, అప్పుడు విజయేంద్రప్రసాద్‌ మంచి కథతో వస్తే ఆయన దర్శకత్వంలోనే ఓ చిత్రం చేస్తానని రజనీ మాట ఇచ్చాడట. కాగా విజయేంద్రప్రసాద్‌ గతంలో నాగార్జున ప్రధానపాత్రలో 'రాజన్న' చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మొత్తానికి 'బాహుబలి, భజరంగీభాయిజన్‌'లు విజయేంద్రప్రసాద్‌ పేరును దేశవ్యాప్తంగా ఇనుమడింపజేశాయని చెప్పవచ్చు. 

bahubali
bajarangi bhaijaan
vijayendhraprasad
rajanikanth