ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
బన్నీ ఆ సినిమాకి 'సరైనోడు' అంటున్న బోయపాటి.!

అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ బేనర్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రానికి 'సరైనోడు' అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమాకి 'రథం' అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తన సినిమా టైటిల్ అది కాదని బోయపాటి అప్పుడే చెప్పాడు. ఈ సినిమాలో బన్ని క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని, దానికి తగ్గట్టుగానే టైటిల్ కూడా పవర్‌ఫుల్‌గా వుండేలా పెడతానని చెప్పిన బోయపాటి లేటెస్ట్‌గా ఈ చిత్రానికి 'సరైనోడు' టైటిల్ కన్‌ఫర్మ్ చేసారని తెలుస్తోంది. 'రథం' టైటిల్ కూడా ఇలాగే మీడియాలోకి వచ్చిన తర్వాత ఆ టైటిల్ కాదన్న బోయపాటి మరి 'సరైనోడు' టైటిల్‌ని ఫైనల్‌గా కన్‌ఫర్మ్ చేసినట్టా? లేక ఇది కూడా కాదని వేరే టైటిల్‌కి వెళ్తాడో వేచి చూడాలి.
allu arjun new movie sarainodu
allu arjun and boyapati srinu movie title
allu aravind new movie








































