‘బాహుబలి’కి ‘పులి’ పోటీనా?

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బాహుబలి’ గురించిన విశేషాలు, చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ తమిళ హీరో ఈ చిత్రానికి కౌంటర్‌ ఇవ్వడానికి సిద్దపడుతున్నాడని కోలీవుడ్‌ మీడియా అంటోంది. అతను మరెవరో కాదు... విజయ్‌ తాజా చిత్రం ‘పులి’. ఇందులో విజయ్‌తో పాటు శ్రీదేవి, సుదీప్‌, శృతిహాసన్‌, హన్సిక తదితరులు నటిస్తుండటం. ఈ చిత్రం కూడా దాదాపు 120కి పైగా కోట్లతో రూపొందుండటం. ఈ చిత్రం కూడా ఓ పౌరాణిక తరహా ఫాంటసీ చిత్రం కావడం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వస్తుండటంతో ఇలాంటి వార్తలకు బలం చేకురుతోంది. కానీ తమిళనాట కొన్ని పత్రిలు, చానెల్స్‌తో పాటు ట్రేడ్‌ వర్గాలు మాత్రం ఈ రెండు చిత్రాలకు పోలిక అసలు లేదని, ‘బాహుబలి’కి ‘పులి’ చిత్రం ఏమాత్రం పోటీ కాదని అంటున్నారు. 

bahubali
puli
vijay
prabhas
rajamouli
bahubali vs puli
sridevi
Advertisement
Advertisement