ఇక ప్రభాసే మిగిలాడు....!

CineJosh news

టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ హీరోలు అందరూ పెళ్లి చేసుకొని ఓ ఇంటివారవుతున్నారు. ఇక ఇక్కడ మిగిలింది టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ ప్రభాస్‌ మాత్రమే. అయితే ‘బాహుబలి’ పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని చెప్పిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ‘బాహుబలి’ మొదటి భాగం షూటింగ్‌ పూర్తయింది. రెండో భాగం షూటింగ్‌లో 30శాతం మాత్రమే మిగిలివుంది. తాజా సమాచారం ప్రకారం ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన మిగిలి ఉన్న 30శాతం షూటింగ్‌ పూర్తయిన తర్వాత ప్రభాస్‌ తన పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో ఉండే తమ బందువుల అమ్మాయిని మ్యారేజ్‌ చేసుకునేందుకు ప్రభాస్‌ ఓకే చెప్పాడని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌లో ప్రభాస్‌ పెళ్లి జరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

prabhas
bahubali
marriage
westgodavari
december end marriage