Advertisement

చాలాకాలం తర్వాత రజనీ స్ట్రయిట్‌ తెలుగు చిత్రం!

సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్ట్రయిట్‌ తెలుగు చిత్రంలో నటించి చాలాకాలం అయింది. అప్పుడెప్పుడో మోహన్‌బాబు నటించిన ‘పెదరాయుడు’ తర్వాత ఆయన మరో తెలుగు చిత్రం చేయలేదు. అయితే ఆయన నటించినచిత్రాలన్నీ తెలుగులో విడుదల అవుతుండటంతో ఆ లోటు కనిపించడం లేదు. కాగా రజనీ తాజాగా రంజిత్‌ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మిస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని తమిళంతో పాటు ఒకేసారి తెలుగులో కూడా తీస్తున్నామని, తెలుగు చిత్రానికి సంబంధించిన ఆర్టిస్టుల ఎంపిక కూడా జరుగుతోందని తెలిపాడు. సో... మొత్తానికి చాలాకాలం తర్వాత రజనీ తెలుగు వారిని తన స్ట్రయిట్‌ చిత్రంతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. 

rajinikanth
telugu movie
pedarayudu movie
kalaipuli thanu