Advertisementt

మరోసారి ఔదార్యం చాటిన పవన్‌కల్యాణ్‌..!!

Mon 20th Apr 2015 02:29 PM
pawan kalyan,sreeja,gabbar singh 2  మరోసారి ఔదార్యం చాటిన పవన్‌కల్యాణ్‌..!!
మరోసారి ఔదార్యం చాటిన పవన్‌కల్యాణ్‌..!!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో ఔదార్యానికి పవన్‌కల్యాణ్‌ పెట్టింది పేరు. గతంలో ఖమ్మంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న శ్రీజ అనే చిన్నారి కోరిక మేరకు ఆమెను పవన్‌ పరామర్శించిన సంగతి గురుండే ఉంటుంది. ఆ బాలిక తిరిగి కోలుకుంటే తాను మళ్లీ కలుస్తానని పవన్‌ హామీ ఇచ్చారు. అదృష్టవశాత్తు శ్రీజ పూర్తిగా కోలుకోవడంతో పవన్‌ ఆదివారం ఉదయం తన కార్యాలయంలో శ్రీజను మళ్లీ కలుసుకున్నారు. శ్రీజ కోలుకోవడానికి కారణమైన వైద్యులకు పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ సమయంలో పవన్‌ పూర్తిగా ఓ కొత్త గెటప్‌లో కనిపించారు. పెరిగిన గడ్డం, జుట్టుతో ఆయన సరికొత్త స్టైల్‌లో దర్శనమిచ్చారు. అయితే పవన్‌ సినిమాలో క్యారెక్టర్‌ కోసం గడ్డం, జట్టు పెంచుతున్నారా..? లేక ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో అలా మెయిన్‌టైన్‌ చేస్తున్నారా.. ? అనేది అర్థంకాకుండా ఉంది. ఇక ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న గబ్బర్‌సింగ్‌ త్వరలోనే పట్టాలక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ