ఫామ్‌ కోసం రవిబాబు ఆరాటం!!

దర్శకనటుడు రవిబాబు గతంలో ‘అవును’ చిత్రం తీసి మంచి హిట్టుకొట్టాడు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘అవును 2’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సినిమా ఎప్పుడో పూర్తి అయినప్పటికీ ‘గోపాల గోపాల’ రిలీజ్‌, ఆ తర్వాత రామానాయుడు మృతితో ఈ చిత్రం విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని  ఏప్రిల్‌ 2 లేదా 3 వతేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వాయిదా పడితే ఆ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ డేట్‌  మిస్‌ అయితే మరో రెండు మూడు నెలల దాకా విడుదల కష్టమని యూనిట్‌ భావిస్తోంది. సురేష్‌ప్రొడక్షన్స్‌తో కలిసి ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై రవిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హర్షవర్థన్‌ రాణే, పూర్ణ జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై రవిబాబు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. తన కిందటి చిత్రం ‘లడ్డూబాబు’ డిజాస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో ‘అవును2’ ద్వారా మరలా ఫామ్‌లోకి రావాలని రవిబాబు కసితో ఉన్నాడు. లోబడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెట్టుబడిలో సగం శాటిలైట్‌ ద్వారానే వచ్చే అవకాశం ఉండటంతో యూనిట్‌ ఎంతో హ్యాపీగా ఉంది.

ravi babu
suresh productions
avunu 2
ravi babu movies