మెగా ఫ్యామిలీ పై దాసరి ప్రయోగం బెడిసి కొట్టింది..!

Tue 24th Mar 2015 01:06 PM
dasari narayana rao,son of satyamurthy audio,chiranjeevi,pawan kalyan  మెగా ఫ్యామిలీ పై దాసరి ప్రయోగం బెడిసి కొట్టింది..!
మెగా ఫ్యామిలీ పై దాసరి ప్రయోగం బెడిసి కొట్టింది..!
Sponsored links

మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌ వంటి వారి మద్య విభేదాలు సృష్టించేందుకే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ఆడియోవేడుకలో దాసరి చాలా తెలివిగా మాట్లాడాడు. కానీ ఆ పని దాసరి ఎందుకు చేసినప్పటికీ విభేదాలు ఎక్కువ అవుతాయనే భయం వీడి మెగాఫ్యామిలీ అందరూ కలిసికట్టుగా నిలబడాలనే ఉద్దేశ్యాన్ని బలపరుస్తున్నాయి. విడిపోతారులే అని మాట్లాడితే.. అది చివరకు మెగాఫ్యామిలీ ఐక్యతకు దారి తీయడం తాను తవ్విన గుంతలో పడినట్లయింది దాసరి పరిస్థితి. ఇటీవల మెగాఫ్యాన్స్‌ అసోసియేషన్స్‌తో మెగాబ్రదర్‌ నాగబాబు సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ...మెగా ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవు.మేమంతా కలిసే ఉన్నాం. త్వరలోనే చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో కలిసి మీ అందరితో మీటింగ్‌ పెట్టమని సూచిస్తాను.. అని అభిమానులకు నాగబాబు అభయం ఇచ్చాడు. ఇది విన్న మెగాభిమానులు ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటున్నారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019