Advertisement

గోపీచంద్‌కు ఆ లుక్ లేదు?

Wed 11th Mar 2015 03:53 AM
gopichand,jil movie  గోపీచంద్‌కు ఆ లుక్ లేదు?
గోపీచంద్‌కు ఆ లుక్ లేదు?
Advertisement

‘తొలివలపు’ సినిమాతో హీరోగా ఫెయిలైన గోపీచంద్ ఆ తర్వాత జయం, వర్షం చిత్రాల్లో విలన్‌గా నటించి సక్సెస్ బాట పట్టాడు. ‘యజ్ఞం’ చిత్రంతో హీరోగా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన ఈ కథానాయకుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరోగా పర్వాలేదనిపించుకున్నాడు. ఇటీవల ‘లౌక్యం’ చిత్రంతో సక్సెస్‌బాట పట్టిన గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘జిల్’. ఈ చిత్రంలో గోపీచంద్‌ను యూత్‌ఫుల్ లుక్‌లో చూపించడానికి దర్శక, నిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను, స్టిల్స్‌ను చూస్తుంటే ఇది అర్థమవుతుంది. అయితే గోపీచంద్‌ను ఇప్పటి వరకు యాక్షన్ అండ్ మాస్ హీరోగా చూసిన ప్రేక్షకులకు ఈ యూత్‌ఫుల్ లుక్‌లో అంతగా నచ్చడం లేదని ఫిల్మ్‌నగర్ టాక్. కుర్రహీరోలా.. గోపీచంద్‌ను అలా ఫోకస్ చేయడం అతని ఏజ్ తగిన విధంగా లేదని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ సీనియర్ హీరోలు సైతం కాలేజ్ స్టూడెంట్స్‌గా నటిస్తుంటే గోపీచంద్ నటించడంలో తప్పేముంది...అని అనుకుంటే గోపీచంద్ అందరికి నచ్చేయడం ఖాయం మరి..! 

Tags:   GOPICHAND, JIL MOVIE
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement