నమిత మోసపోయింది..!

CineJosh news

ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా తమిళ తంబీల చేత గుళ్ళు కూడా కట్టించుకున్న బొద్దు గుమ్మ నమితకు ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. రీసెంట్ గా ఓ ఈవెంట్ మేనేజర్ తనని మోసం చేశాడని ఆమె ఆరోపిస్తుంది. ఆ మేనేజర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆమె మాట్లాడుతూ... రీసెంట్ గా నన్ను ఓ ఈవెంట్ మేనేజర్ మోసం చేశాడు. ఓ  ప్రత్యేక కార్యక్రమంలో  పాల్గొనందుకు ఇస్తానని ఒప్పుకున్న సొమ్మును ఇవ్వకుండా ముఖం చాటేశాడు. ఇటీవల సూరత్ లో జరిగిన ఓ వేడుకలో నర్తించి అక్కడి ఆహుతుల్ని అలరించాను. ఈ కార్యక్రమానికి మేనేజర్ గా వ్యవహరించిన ఓ వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను కొద్ది రోజుల కిందట సంప్రదించాడు. దీనికోసం నాకు పెద్దమొత్తం లో పారితోషికాన్ని ఆఫర్ చేశాడు. గతంలో ఇలాంటి పలు కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించిన వ్యక్తి కావడంతో అతని ఆఫర్ ను వెంటనే అంగీకరించాను.. అంటూ మీడియా ముందు వాపోయింది నమిత.  

hot heroine
namitha
surath program
event manager