Advertisementt

మోడీ చేసిందే రిపీట్‌ చేసిన కేజ్రీవాల్‌..!!

Tue 10th Feb 2015 06:13 AM
delhi election result,arvind kejriwal,narendra modi,main opposition  మోడీ చేసిందే రిపీట్‌ చేసిన కేజ్రీవాల్‌..!!
మోడీ చేసిందే రిపీట్‌ చేసిన కేజ్రీవాల్‌..!!
Advertisement
Ads by CJ

2014 సార్వత్రిక ఎన్నికల్లో 282 స్థానాలను గెలుచుకున్న బీజేపీ దరిదాపుల్లోకి కూడా ఏ పార్టీ రాలేకపోయింది. కేవలం 44 సీట్లను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 55 స్థానాలను గెలుచుకోవాల్సి ఉండగా బీజేపీ మినహా ఏ పార్టీ కూడా ఆ సంఖ్యను చేరుకోలేకపోయింది. తమకు ప్రతిపక్ష హోదాను ఇవ్వాలని కాంగ్రెస్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బీజేపీ మాత్రం తోసిపుచ్చింది. ఇక ఇప్పుడు అదే పరిస్థితి ఢిల్లీలో రిపీట్‌ అయ్యింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం సీట్లలో 10 శాతం అంటే 7 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ బీజేపీ 3 సీట్లకు, కాంగ్రెస్‌  0 సీట్లకు పరిమితమయ్యాయి. దీంతో ఇక ఢిల్లీ ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండానే పాలనసాగనుంది. అప్పుడు కేంద్రంలో ఈ సీన్‌ను మోడీ సాధిస్తే.. మళ్లీ ఢిల్లీలో ఇదే సీన్‌ను రిపీట్‌ చేసి కేజ్రీవాల్‌ బీజేపీ నాయకులకు షాకునిచ్చారు.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ