ఘాటుగా స్పందించిన రేణు..!

పవన్ కళ్యాణ్ గురించి నేనేమి మాట్లాడిన వివాదాస్పదం అవుతోంది.  అందుకే ఆయన గురించిన ప్రశ్నలకు నేను స్పందించను అంటోంది పవన్ మాజీ భార్య రేణూదేశాయ్. రేణూదేశాయ్ బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ గురించి అడిగిన ప్రశ్నల విషయంలో తాను ఇచ్చిన సమాధానాలను కొందరు మరో రకంగా అర్ధం చేసుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ మధ్య ఆమె ట్విట్టర్ లో పవన్ పలుసార్లు వ్యాఖ్యానించింది. ఆయన్ను పొగుడుతూ ఆమె వ్యాఖ్యానాలు ఉన్నాయి. అయితే ఆమె కావాలని తన ఇమేజ్ పెంచుకోవడానికే పవన్ పేరును వాడుకుంటోందని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై రేణూదేశాయ్ ఘాటుగా స్పందించింది. నా కూతురు ఆద్య కోసం ఓ కవిత రాసాను. దానికి కొందరు నేను పవన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఊహించుకుంటున్నారు. నేను చేసే ప్రతీ ట్వీట్ పవన్ కోసం కాదు. నేను చేసే ప్రతీ ట్వీట్ లో పవన్ పేరు ప్రస్తావిస్తే ఆయన పేరును వాడుకున్నట్లు అవుతుంది.. అని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అయితే ఎవరో చేసే విమర్శకులకు నేను స్పందించను. నాకంటూ మనసు ఉంది. నేను రోబో ను కాదు. నేను ఆయన్ను కాపీ కొట్టడం లేదు. నాకంటూ ఆలోచనలు ఉన్నాయి. నిర్మాతగా, దర్శకురాలిగా, నటి గా.. వివిధ భాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. నా గురించి కొందరు ఇకనైనా అలా ఆలోచించడం మానుకోవాలి.. అని హితవు పలికింది.  

pawan kalyan
renudesai
birthday
interview
twitter
image
aadhya
robo