Advertisementt

రాజమౌళి ఏదో మాయ చేస్తున్నాడు..!?

Fri 26th Dec 2014 05:49 AM
rajamouli,visualizing making video,bahubali,rajamouli mesmerizing with bahubali,ss rajamouli,bahubali making video  రాజమౌళి ఏదో  మాయ  చేస్తున్నాడు..!?
రాజమౌళి ఏదో మాయ చేస్తున్నాడు..!?
Advertisement
Ads by CJ
>ఆశ పెట్టడం ఎలా? సైలెంట్ గా సినిమాకు అంచనాలు పెంచడం ఎలా? అనే విషయంలో దర్శకధీరుడు రాజమౌళి పి.హెచ్.డి. చేసినట్లు ఉన్నాడు. తన తాజా ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి' విషయంలో పబ్లిసిటీపరంగా తనదైన ప్రత్యేక శైలిలో ఆయన సాగుతున్నాడు. చూపించి, చూపించకుండా అందరిలో ఆసక్తిని పెంచుతున్నాడు. సినిమా విడుదలకు చాలా టైమ్ ఉంది కాబట్టి ఇప్పుడే సినిమా సీన్స్ ని విడుదల చేయకుండా తన టీమ్ ఈ చిత్రానికి పడుతున్న కష్టాన్ని చూపిస్తూ 'విసువలైజింగ్ ది వరల్డ్ ఆఫ్ బాహుబలి' పేరుతో ఇటీవల ఓ మేకింగ్ వీడియాను విడుదల చేసాడు. ఈ ట్రైలర్ నిడివి మూడు నిమిషాలు ఉంది. ఇందులో హీరో హీరోయిన్లను చూపించకుండా రాజమౌళి దాగుడుమూతలు ఆడాడు. ఒకటి రెండు చోట్ల హీరో హీరోయిన్లను చూపించినప్పటికీ అవన్నీ పాత విజువల్స్ కావడం గమనార్హం. కేవలం తన టీమ్ ఈ చిత్రానికి పడుతున్న కష్టాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే ప్రయత్నం చేసిన రాజమౌళి ఈ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఆ ట్రైలర్ కు మంచి స్పందన లబిస్తుండమే దీనికి ఉదాహరణ. ఈ ట్రైలర్ ద్వారా ఇన్ డైరెక్ట్ గా సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయాన్ని తెలియజెప్పడంలో రాజమౌళి విజయం సాధించాడంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ