ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Is Disappointment Waiting for Prabhas Fans?

ప్రభాస్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ తప్పదా?

Is Disappointment Waiting for Prabhas Fans?Is Disappointment Waiting for Prabhas Fans?

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23. ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్ డేట్స్ ని ఫౌజీ మేకర్స్, స్పిరిట్ మేకర్స్ వదులుతారని అభిమానులు ఎప్పటి నుంచో కాచుకుని కూర్చున్నారు. అందులోను డిసెంబర్ 3 నుంచి వాయిదాపడిన ఫౌజీ విషయంలో ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు.

అక్టోబర్ 23 న కచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫౌజీ నుంచి టీజర్ ఉంటుంది, అదే టీజర్ తో విడుదల తేదీ కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్తతో అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. కానీ తాజాగా ఫౌజీ నుంచి టీజర్ ని ప్రభాస్ బర్త్ డే కి వదలడం లేదు అని, కానీ దానికి మించి అదిరిపోయే ట్రీట్ ని ఫౌజీ మేకర్స్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.

మళ్లీ కేవలం రిలీజ్ డేట్ పోస్టర్ తో సరిపెడతారా, బర్త్ డే కి టీజర్ ఇస్తే బావుంటుంది అని అభిమానులు కోరుకుంటున్న సమయంలో టీజర్ లేదు అనే వార్త మాత్రం వాళ్ళను బాగా డిజప్పాయింట్ చేస్తుంది. మరి అభిమానులని నిరాశపరిచే ఉద్దేశ్యం లేదు, టీజర్ ఇవ్వకపోయినా గట్టి ట్రీట్ ని మేకర్స్ ఇస్తున్నారు అంటే అభిమానులు శాంతించాల్సిందే. 
 

Will Prabhas Disappoint His Fans This Time?