ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sonali Bendre Beat Cancer With Love, Not War

క్యాన్స‌ర్ ని పోరాటంతో కాదు ప్రేమ‌తో నెగ్గిన న‌టి!

Sonali Bendre Beat Cancer With Love, Not WarSonali Bendre Beat Cancer With Love, Not War

 

బాలీవుడ్ సీనియర్ నటి సోనాలి బింద్రే  క్యాన్సర్ ప్రయాణం పై స్పూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటి మాధురీ దీక్షిత్‌తో జరిపిన ప్రత్యేక సంభాషణలో సోనాలీ బింద్రే తన జీవితంలో ఎదురైన అత్యంత కష్టతరమైన సమయం గురించి ఓపెన్‌గా మాట్లాడారు. చాలామంది క్యాన్సర్‌తో పోరాడటాన్ని ఒక యుద్ధం  గా అభివర్ణిస్తారని..కానీ తాను మాత్రం ఎప్పుడూ ఆ కోణంలో చూడలేదని వెల్లడించారు. రోగాన్ని జయించే క్రమంలో తన శరీరాన్ని ఎంతో ప్రేమతో, గౌరవంతో చూసుకోవడమే అత్యంత ముఖ్యమైన అంశంగా ఎంచుకున్నానని సోనాలి పేర్కొన్నారు.

క్యాన్సర్ నిర్ధారణ అయిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ ఆ వార్త వినగానే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఒత్తిడికి గురయ్యానని సోనాలి తెలిపారు. అయితే తన శరీరంపై కోపం తెచ్చుకోవడం లేదా దాన్ని ఒక శత్రువులా భావించడం సరికాదని భావించినట్లు చెప్పారు. `నా శరీరం ఎన్నో సంవత్సరాలుగా నాకు సహకరిస్తూ వచ్చింది. అలాంటిది వ్యాధి బారిన పడినప్పుడు దానిపై యుద్ధం ప్రకటిస్తే ప్రయోజనం ఉండదు` అని భావించి శస్త్రచికిత్సలు, కీమోథెరపీల సమయంలో  శరీరాన్ని ప్రేమగా చూసుకోవడం, దానికి తగిన సమయం ఇవ్వడమే కోలుకోవడానికి కారణమైందన్నారు.

సోనాలి మాటలపై స్పందించిన మాధురీ దీక్షిత్ ఆమె చూపించిన ధైర్యం , ధృడమైన దృక్పథం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు. కష్టసమయాల్లో ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకుండా సానుకూల దృక్పథంతో నిలబడటం వల్ల ఎలాంటి సవాళ్లనైనా జయించవచ్చని సోనాలి జర్నీ నిరూపించిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న సోనాలి తన అనుభవాలను పంచుకుంటూ క్యాన్సర్ బాధితులకు మానసిక ధైర్యాన్ని, ఆశను నింపే ప్రయత్నం చేస్తున్నారు.

Sonali Bendre's Inspiring Words on Her Cancer Battle