ఆ హీరో కళ్లతోనే అద్భుతం చేస్తారు!
Shriya Saran calls Ajay Devgn a very intense actor
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌ను నటి శ్రియా సరన్ కొనియాడారు. `దృశ్యం` సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీలో అజయ్ దేవగన్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను శ్రియ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అజయ్ దేవగన్ నటనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అజయ్ దేవగన్‌ను ఇంటెన్స్ యాక్టర్ గా అభివర్ణించిన శ్రియా సరన్..ఆయన కళ్ల ద్వారానే ఎంతో భావోద్వేగాన్ని పండించగలరని తెలిపారు. అజయ్ కళ్లలో ఉండే ప్రత్యేకమైన శక్తి, సంభాషణలు లేకుండానే పాత్రలోని లోతును ప్రేక్షకులకు చేరువ చేస్తుందని ప్రశంసించారు. అలాగే అజయ్ డైలాగ్ డెలివరీ స్టైల్ కూడా ఎంతో విభిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.
అజయ్ దేవగన్ పనిపట్ల చూపించే అంకితభావం, క్రమశిక్షణ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని శ్రియా తెలిపారు. షూటింగ్ సమయంలో ఆయన పడే కష్టాన్ని చూస్తే ఎవరికైనా గౌరవం కలుగుతుందని, చాలాసార్లు ఆయనకు ఎక్కువ టేక్స్ కూడా అవసరం పడకుండా మొదటి టేక్‌లోనే సీన్‌ను రక్తికట్టించగలరని కొనియాడారు.
















































