నిర్మాతలూ జర జాగ్రత్త
Rising Budgets: A Warning for Producers
ప్రతి ఒక్క నిర్మాత సినిమాలను నిర్మిస్తున్నారు అంటే.. డబ్బులొస్తాయనే ఆశతోనే. అందుకే చిన్న నిర్మాతలు చిన్న హీరోల దగ్గరకు పెద్ద, పేరున్న నిర్మాతలు స్టార్స్ దగ్గరకు వెళ్లి సినిమాలకు అడ్వాన్సు ఇచ్చి సినిమాలను సెట్ పైకి తెస్తారు. ఒకొనొక సమయంలో బడ్జెట్ మితిమీరిపోతుంటే ఫైనాన్షియర్స్ దగ్గరకు పరిగెత్తి మరీ నిర్మాతలు అధిక వడ్డీలకు డబ్బు తెచ్చి సినిమాని ఫినిష్ చేస్తారు.
ఆ సినిమా రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. హిట్ అయితే ఆ అనిర్మాతకు కాసులు కురుస్తాయి. ప్లాప్ అయితే ఆ నిర్మాత మరో సినిమాకి కనిపించకుండా పోయే పరిస్థితి వచ్చేసింది. అయితే నిర్మాతలు ధైర్యంగా సినిమాలు చేస్తున్నారు. డబ్బు పెడుతున్నారు. కానీ దర్శకులు సరైన స్క్రిప్ట్ లేకుండా సినిమాలు తీస్తున్నారనే మాట మెగాస్టార్ అంతటి వారే చెప్పారు.
ఇక హీరోలు కూడా సినిమా సెట్ పైకి వెళ్ళాక మేకోవర్ కారణంగానో, ప్రమాదాల కారణంగానో బ్రేక్ ఇవ్వడం వల్ల సెట్ పై ఉన్న సినిమాల నిర్మాణాల భారం పెరిగిపోతుంది. సగం సినిమా చేసాక రీ షూట్స్ అంటూ దర్శకులు కూడా నిర్మాతల డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టిస్తున్నారు. ఏళ్లతరబడి సినిమాల షూటింగ్ జరగడంతో నిర్మాణ భారం పెగిపోతుంది.
రెండుమూడేళ్లుగా సినిమాని చెక్కుతూనే ఉంటారు. కానీ రిలీజ్ టైమ్ కి హరిబరీ. ప్రమోషన్స్ కి టైమ్ సరిపోదు, పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం సరిపోదు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది. నిర్మాతలు జాగురూకతతో ఉండడం లేదా, లేదంటే టాప్ డైరెక్టర్స్ ని, టాప్ హీరోలను ఏమి అనలేక చేతులు కట్టుకుని కూర్చుంటున్నారా.. ఏది ఏమైనా నిర్మాతలు కాస్త జాగ్రత్త వహిస్తే బావుంటుంది అనేది సదరు సినిమా ప్రేక్షకుడు కూడా ఇస్తున్న సలహా.
















































