బిగ్ బాస్ పై ఇరిటేట్ అవుతున్న ఆడియన్స్

Bigg Boss Faces Audience FrustrationBigg Boss Faces Audience Frustration

 

బిగ్ బాస్ సీజన్ 10 కి మెల్లగా అలవాటు పడుతున్న ఆడియన్స్ ఇప్పుడు ఇరిటేటింగ్ గా ఫీలవుతున్నారు. నిన్నమొన్నటివరకు, త్రిగున్, రోహిత్ ల గొడవ ను ఎంజాయ్ చేసిన బిగ్ బాస్ రివ్యూస్, బుల్లితెర ఆడియన్స్ అంతా ఇప్పుడు హౌస్ మేట్స్ రచ్చ చూసి చిరాకు వేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

త్రిగున్ తో పాటుగా రోహిత్ అరుపులు అలాగే హౌస్ లో స్క్రీన్ స్పేస్ కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అపూర్వ, షాలిని చీటికీ మాటికి అరుపులు, మధ్య మధ్యలో అమన్ గొడవ ఇవన్నీ ఆడియన్స్ కి ఇరిటేట్ కలిగిస్తున్నాయి. నామినేషన్స్ అప్పుడు మాత్రమే కాదు టాస్క్ ల విషయంలోనూ హౌస్ మీట్స్ సిల్లీ రీజన్స్ తో అరుచుకోవడం అన్ని సీజన్ 10 పై నెగిటివిటి మొదలయ్యేలా చేసింది.

కేవలం రావడంతోనే హైలెట్ అవుతామని అగ్నిపరీక్ష టీం ఫీలవుతుంది. అందుకే అవసరమున్నా, అవసరం లేకపోయినా అరుస్తున్నారు. హౌస్ మొత్తం సౌండ్ పొల్యూషన్ అన్నట్టుగా ఆడియన్స్ బాగా ఫీలవుతున్నారు. మరి నాలుగో వారం లో ఎవరు ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడడతారో చూడాలి.

Bigg Boss Sparks Irritation Among Viewers