నేషనల్ అవార్డ్స్: కల్కి స్పెషల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇండియన్ స్క్రీన్స్ పై బిగ్గెస్ట్ హిట్‌గా చరిత్ర సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు లభించాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు దక్కింది. అలాగే సినిమాకు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించిన ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానికి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు లభించింది.
చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీదత్, స్వప్నదత్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని అవార్డులు అందుకున్నారు.
భారీ కాన్వాస్‌పై, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు దక్కడం వైజయంతీ మూవీస్‌కు మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది.
దర్శకుడు నాగ్ అశ్విన్ తన యూనిక్ విజన్‌తో క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ ప్రపంచం, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, సాంకేతిక నైపుణ్యం, నటీనటుల ప్రతిభకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయి.
దశాబ్దాలుగా భారతీయ సినీ రంగంలో వైజయంతీ మూవీస్ తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. ప్రతిష్ఠాత్మక చిత్రాలను నిర్మిస్తూ, కొత్త కథలను అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సంస్థ ఎప్పుడూ ముందుంటోంది. ఈ క్రమంలో ‘కల్కి 2898 ఏడీ’కి రెండు జాతీయ అవార్డులు రావడం సంస్థ ప్రయాణంలో మరో గర్వకారణమైన అధ్యాయంగా నిలిచింది.
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికపై ‘కల్కి 2898 ఏడీ’ టీమ్ అవార్డులు అందుకున్న ఈ ప్రత్యేకమైన క్షణాలు సినీ అభిమానులకు కూడా మెమరబుల్ గా నిలిచాయి.
















































