అస్సలు వార్తల్లో లేని టాక్సిక్
Yash’s Toxic Is Nowhere In The News
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన టాక్సిక్ చిత్రం ఎక్కడా వార్తల్లో వినిపించడమే లేదు. ఆగస్టు 26 న విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా ఆడియన్స్ ను పూర్తిగా నిరాశపరిచింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ బిగ్ బడ్జెట్ మూవీ.. ఆ అంచనాలు అందుకోవడం లో 100 శాతం విఫలమైంది.
దానితో రెండో రోజుకే టాక్సిక్ థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించలేదు. వారానికే టాక్సిక్ దుకాణం పూర్తిగా సర్దేసింది. ఇక టాక్సిక్ టాక్ చూసాక ఓటీటీ లు కూడా వెనక్కి తగ్గాయి. విడుదలకు ముందు రూ.150 కోట్ల డీల్ కోసం ముందుకు వస్తే.. విడుదలయ్యాక రూ.30 కోట్లు ఇవ్వడానికి వెనుకాముందు ఆలోచించాయి.
ఎంత చెత్త సినిమా అయినా ఓటీటీలో చూసేందుకు ఎంతోకొంత ఇంట్రెస్ట్ చూపించే ఓటీటీ ఆడియన్స్ కూడా టాక్సిక్ కోసం ఎదురు చూడడం లేదు, అసలు టాక్సిక్ ముచ్చట కూడా తియ్యడమే లేదు. హీరో యష్ కెరీర్ లో బిగ్ బ్లండర్ గా టాక్సిక్ చిత్రం మిగిలిపోయింది.
















































