బిగ్ బాస్: నాగ్ కు కళ్ళు చెదిరే పారితోషికం
Bigg Boss: Nagarjuna Gets a Jaw-Dropping Paycheck
బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్ గా మొదలయ్యింది. ఆదివారం సాయంత్రం 16 మంది కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. హోస్ట్ గా నాగార్జున ప్రతి ఒక్క కంటెస్టెంట్ తో ముచ్చటించి మరీ హౌస్ లోకి పంపారు. గత ఏడు సీజన్స్ గా నాగార్జున బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2 కి హీరో నాని హోస్ట్ లుగా చేసారు. మూడో సీజన్ నుంచి ఎంటర్ అయిన నాగార్జున ఇప్పుడు పదో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్ బాస్ పై వస్తున్న విమర్శలు చూసి మరె హీరో అయినా హోస్ట్ స్థానం నుంచి తప్పుకునేవారే. కానీ నాగ్ మాత్రం ఆ విమర్శలు అస్సలు పట్టించుకోరు.
కారణం అధిక పారితోషికం కూడా అవొచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. సీజన్ 3 కి పది కోట్ల పారితోచ్సిక తీసుకున్న నాగార్జున ప్రతి సీజన్ కి పెంచుకుంటా గత సీజన్ కి దాదాపుగా రూ.35 కోట్ల పారితోషికం అందుకున్నారని తెలుస్తుంది. అంటే ఈ సీజన్ కి మరో రూ.5 కోట్లు పెరిగే ఉంటుంది అంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 10 కి నాగార్జున అక్షరాలా రూ.40 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తుంది. సో ఈ లెక్కన సినిమాల కన్నా ఎక్కువ బిగ్ బాస్ ద్వారానే అధిక రాబడి ఉండడంతోనే నాగ్ బిగ్ బాస్ ని వదలడం లేదు అంటున్నారు.







































