ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Apoorva Mukhija Breaks Silence on Coachella Row

దారం వివాదంపై స్పందించిన రెబెల్ కిడ్!

Apoorva Mukhija Breaks Silence on Coachella RowApoorva Mukhija Breaks Silence on Coachella Row



ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజా (రెబెల్ కిడ్) గతేడాది జరిగిన `కోచెల్లా కలావా` వివాదంపై తాజాగా  స్పందించారు. అమెరికాలోని  సంగీత ఉత్సవం `కోచెల్లా`కు హాజరైన సమయంలో చేతికి ఉన్న పవిత్ర దారమైన కలావాను కత్తిరించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో  ట్రోలింగ్, బెదిరింపులు ఎదుర్కొన్న అపూర్వ.. ఆ చేదు జ్ఞాపకాలు ..మానసిక సంఘర్షణ గురించి  ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు.

ఆ సంఘటన తన జీవితంలో అత్యంత కష్టమైన సమయమని.. మానసికంగా  కుంగిపోయానని అపూర్వ తెలిపారు. `నేను ఉద్దేశపూర్వకంగా ఏ మతాన్ని లేదా ఎవరి భావాలను గాయపరచాలని అలా చేయలేదు. ఆ కత్తెరతో దారాన్ని తీసేటప్పుడు అది నా దేవుడిపై ఉన్న నమ్మకాన్ని తగ్గించదు. ఒక దారాన్ని కత్తిరించినంత మాత్రాన భగవంతుడికి ఎలాంటి తేడా రాదని.. ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకోడని నేను నమ్ముతాను` అని అపూర్వ స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ద్వేషం మానసికంగా విరక్తి కలిగించిందని పేర్కొన్నారు.

అయితే ఆ వివాదం తర్వాత  ఎంతో నేర్చుకున్నానని, సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలు పంచుకోవాలి? దేనికి దూరంగా ఉండాలనే? స్పష్టత వచ్చిందని  వివరించారు. నెటిజన్ల నుంచి ఎలాంటి విమర్శలు వ‌చ్చినా?  నిజాయితీని వదులుకోనని.. తప్పులను ఒప్పుకుంటూ ముందుకు సాగడమే తన నైజమన్నారు. ఆ చేదు అనుభవం తదనంతర కాలం  మరింత దృఢమైన వ్యక్తిగా మార్చిందని అపూర్వ ముఖిజా అభిప్రాయపడ్డారు.

Apoorva Mukhija on Coachella Backlash