కెమెరా మెన్లపై హీరో సంచలనం వ్యాఖ్యలు!
Salman Khan Loses Cool At Paparazzi
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రజాదరణ పొందిన రియాలిటీ షో `బిగ్ బాస్ 20` ప్రమోషనల్ షూటింగ్ వేళ ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని సెట్స్‌లో ప్రమోషన్స్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్‌ను కవర్ చేయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్లు ఆయన్ని వరుసగా ఫోటోలు దిగమని కోరడంతో సల్మాన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. షూటింగ్ క్రమంలో కెమెరాల ముందుకు వచ్చి ఫోటోలకు పోజులివ్వాలని ఫోటోగ్రాఫర్లు పదే పదే ఒత్తిడి తెచ్చిన వేళ సల్మాన్ ఖాన్ వారితో నేరుగా మాట్లాడవలసి వచ్చింది.
ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో సల్మాన్ ఖాన్ స్టేజీకి కొంత దూరంలో నిలబడాలని ఫోటోగ్రాఫర్లను కోరారు. వారు వినకుండా మళ్లీ ఫోటోల కోసం అడుగుతుండటంతో, స్పందించిన సల్మాన్.. `ఇది నా పని కాదు. కెమెరా ముందుకు రావాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు` అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా వారు ఫోటోలు కావాలని అడగడంతో `ఫోటోస్... ఫోటోస్... ఫోటోస్` అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత వాతావరణాన్ని సర్దుమణిగించేలా కెమెరా మెన్లతో కలిసి సల్మాన్ ఫోటోలకు పోజులివ్వడం విశేషం.
ఈ ప్రమోషనల్ షూట్ సమయంలో సల్మాన్ ఖాన్ ధరించిన కౌబాయ్ లుక్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. డార్క్ బ్రౌన్ కలర్ లెదర్ కౌబాయ్ హ్యాట్, నేవీ బ్లూ టీ-షర్ట్, ఆలివ్ గ్రీన్ వెస్ట్ , డెనిమ్ జీన్స్ లూప్‌లో తన మార్క్ టర్కోయిస్ బ్రాస్‌లెట్‌తో సల్మాన్ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ప్రముఖుల సమక్షంలో సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభం కానున్న బిగ్ బాస్ 20 సీజన్‌పై ఈ సంఘటనతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.







































