సల్మాన్ - పైడిపల్లి టైటిల్ ఇంకా రాకుండానే
Salman-Vamshi Film Title Buzz Gets Stronger
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలయికలో చేస్తున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ పై ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC63) బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి `మాన్‌స్టర్` అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారంటూ సోషల్ మీడియాలో కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ టైటిల్ కేవలం ప్రచారంలో ఉన్న అనధికారిక వార్త మాత్రమేనని..చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. విశాల్ మిశ్రా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఈద్ 2027 (మార్చి 2027) కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమాపై వస్తున్న వరుస అప్‌డేట్స్‌తో సల్మాన్ ఖాన్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటిసారి పైడిపల్లి ఒక బాలీవుడ్ హీరోతో పని చేయడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.







































