ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Will Swayambhu Finally See the Light of Day

స్వయంభు కి మోక్షం కలిగేనా?

Will Swayambhu Finally See the Light of DayWill Swayambhu Finally See the Light of Day


నిఖిల్ లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం స్వయంభు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి నెలలు గడుస్తున్నాయి. కానీ ఇప్పటివరకు స్వయంభు మేకర్స్ సినిమా విడుదల తేదీని చెప్పకుండా దాటవేస్తున్నారు. స్వయంభు ఓటీటీ డీల్ పూర్తికాకపోవడం వలనే రిలీజ్ డేట్ ఇవ్వడానికి మేకర్స్ వెనక్కి తగ్గుతున్నారు.

నిఖిల్ కూడా స్వయంభు ప్రమోషన్స్ స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేసాడు. స్వయంభు విషయాలు నిఖిల్ కూడా లైట్ తీసుకుంటూ.. తదుపరి ప్రాజెక్ట్స్ పైకి వెళ్ళిపోయాడు. నిర్మాతలు స్వయంభు విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వగానే నిఖిల్ ప్రమోషన్స్ కోసం దిగుతాడు అని తెలుస్తుంది.

మరోపక్క నిఖిల్ ఫ్యాన్స్ స్వయంభు కి మోక్షం ఎప్పుడు కలిగేను అంటూ మేకర్స్ ని ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద విజువల్ మూవీకి విడుదల తేదీ విషయంలో ఎందుకింత జాప్యం, నిర్మాతలు ఇలా ఉంటే ఎన్నో కోట్ల నష్టం వస్తుంది.. మరి ఇదంతా ఎందుకు జరుగుతుందో, అసలు సమస్య ఏమిటో అనేది సామాన్య ప్రేక్షకుడికి అర్ధం కావడమే లేదు. 

Swayambhu’s Long Wait - Will It Finally End