ఫౌజీ: 3 మంత్స్ టార్గెట్

Fauzi Three Months TargetFauzi Three Months Target


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ డిజాస్టర్ మూడ్ లో నుంచి బయటికి రావాలంటే ప్రభాస్ ఫౌజీ తో బలంగా కొట్టాలని ఆశిస్తున్నారు. అందుకే  ఫౌజీపై వారు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఫౌజీ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా దానిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. హను రాఘవపూడి ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న ఫౌజీ పై అంచాలు పెంచుతున్నారు.

ఒకటిరెండుసార్లు డేట్స్ మార్చుకున్న ఫౌజీ డిసెంబర్ 3 విడుదల అంటూ అనౌన్స్ చేసారు. అప్పటినుంచి హను రాఘవపూడి ఇంకా ప్రభాస్ టార్గెట్ పూర్తి చెయ్యడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రభాస్ ముందుగా ఫౌజీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఫౌజీ విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. అక్టోబర్ కల్లా షూటింగ్, ఇంకా విఎఫెక్స్ వర్క్స్ అన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు హను.

నవంబర్ మొత్తం పాన్ ఇండియా మార్కెట్ లో ఫౌజీ ని ప్రమోట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రంలో బ్రాహ్మణ సామజిక వర్గానికి చెందిన బ్రిటిష్ సైనికుడిగా ప్రభాస్ పాత్ర చాలా డిఫరెంట్, ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఉంటుందని తెలుస్తుంది. ఇక వినాయక చవితి లేదంటే దసరా నుంచి ఫౌజీ నుంచి మెల్లగా ప్రమోషనల్ కంటెంట్ రివీల్ చేస్తూ అంచనాలు పెంచే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని సమాచారం. 
 

Fauzi Promotional Plans