ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> LENIN has officially created history on Telugu ZEE5

ఓటీటీ లో లెనిన్ సెన్సేషన్

LENIN has officially created history on Telugu ZEE5

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. థియేట్రిక‌ల్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, సినిమాను చూసేందుకు కొనసాగుతున్న ఉత్సాహానికి ఇదొక ఉదార‌ణ‌.

మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత జూలై 10న థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ను సాధించింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.100 కోట్ల వ‌సూళ్ల‌తో లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి స్పందన కొన‌సాగుతోంది. అదే ఆదరణతో ‘లెనిన్’ మంచి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.


అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ ఓ సినిమా మాత్రమే కాదు. సినిమాలకు సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కెరీర్‌లో కీలక సమయంలో ఈ చిత్రం విడుద‌లైంది. థియేటర్లలో సాధించిన విజయంతో అఖిల్ కెరీర్‌లోనే కొత్త కమర్షియల్ హైను మూవీ అందుకుంది. ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ వరకు ‘లెనిన్’ ప్రయాణం కొనసాగుతోంది. తెలుగు ZEE 5లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా చూస్తుండటంతో, దాని విజయవంతమైన జోరు మరింత ముందుకు సాగుతోంది.

జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభ‌మైన ఒక వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేయడం విశేషం. ఎందుకంటే ఇది సినిమాను ఎంతమంది ప్రేక్షకులు ప్లే చేశారనే సంఖ్యను మాత్రమే కాకుండా, వారు సినిమాను ఎంతసేపు ఆసక్తిగా చూశార‌నే విష‌యాన్ని కూడా తెలియజేస్తుంది. 

LENIN