Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> VD - Rashmika Duo Creates Another Global Record

ఇన్ స్టాలో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి

విజయ్ దేవరకొండ, రశ్మిక కలిసి నటిస్తున్న యాడ్స్ ఇన్ స్టాగ్రామ్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ఈ లైక్స్ తెలియజేస్తున్నాయి. విరోష్ జోడి ఇటీవల కలిసి చేసిన ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 9.1 మిలియన్ పైగా లైక్స్ వచ్చాయి. ఈ లైక్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఒక యాడ్ కు వరల్డ్ వైడ్ గా వచ్చిన సెకండ్ హయ్యెస్ట్ లైక్స్ ఇవే కావడం గమనార్హం.

ఫస్ట్ హయ్యెస్ట్ లైక్డ్ పోస్ట్ కూడా విరోష్ చేసిందే కావడం విశేషం. వీరి వెడ్డింగ్ టైమ్ లో ఎండార్స్ చేసిన మాన్యవార్ యాడ్ 11.5 మిలియన్ కు పైగా లైక్స్ తో హయ్యెస్ట్ లైక్డ్ యాడ్ పోస్ట్ గా గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పోస్ట్ కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు దక్కాయి.

వరల్డ్ వైడ్ సోషల్ మీడియాలో అడ్వర్టయిజింగ్ లో విరోష్ జోడి ఇలా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రికార్డ్ స్థాయి లైక్స్ విజయ్, రశ్మిక చేస్తున్న యాడ్స్ కు గ్లోబల్ రీచ్ తీసుకొస్తున్నాయి. విజయ్, రశ్మిక జోడి త్వరలో "రణబాలి" చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు.
 

Vijay Deverakonda - Rashmika Duo Creates Another Global Instagram RecordVD - Rashmika Duo Creates Another Global Record
Advertisement
Advertisement