ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mahesh Babu is putting immense effort For Varanasi than Others

ఆ ముగ్గురు స్టార్ల‌ను మించి మ‌హేష్ శ్ర‌మిస్తున్నాడా?

Mahesh Babu is putting immense effort For Varanasi than OthersMahesh Babu is putting immense effort For Varanasi than Others

 

`వార‌ణాసి` షూటింగ్ లో భాగంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ జ‌ర్మ‌నీలో బ్లాక్ ఫారెస్ట్ లో ప్ర‌త్యేక  శిక్ష‌ణ తీసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. కానీ బ్లాక్ ఫారెస్ట్ ట్రెకింగ్ శిక్ష‌ణ అంత సుల‌భం కాదు. అత్యంత క‌ఠిన‌మైన‌ది. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..బ్లాక్ పారెస్ట్ దట్టమైన అడవులు, లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధి. ఇక్కడ ట్రెక్కింగ్   శారీరక దృఢత్వానికి సంబంధించింది మాత్రమే కాదు. అద్భుతమైన మానసిక పరీక్ష కూడా.  బ్లాక్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ మార్గాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్ని చోట్ల మెత్తటి మట్టి దారులు ఉంటే? మరికొన్ని చోట్ల నిటారుగా  రాతి దారులుంటాయి.  శిక్షణలో భాగంగా చేసే వెస్ట్‌వేగ్ వంటి మార్గాల్లో సుదీర్ఘమైన ఎత్తుపల్లాలుంటాయి.

ఇక్కడ ట్రెక్కింగ్ చేసేటప్పుడు  మోకాళ్లు - చీలమండల  పై విపరీతమైన ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం కూడా  క్షణక్షణానికి మారిపోతుంది. ఒక్కోసారి దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. మరికొన్ని సార్లు అకస్మాత్తుగా వర్షం కురుస్తుంది. చలికాలంలో మంచు కురుస్తోన్న స‌మ‌యంలో ట్రెక్కింగ్  అత్యంత కఠినమైన సవాలు. అల్పాష్ణస్థితి బారిన పడకుండా ఉండటానికి సరైన దుస్తులు,  శారీరక వేడిని కాపాడుకోవడంపై కఠినమైన  శిక్షణ ఇస్తారు. ఇక్క‌డ ట్రెక్కింగ్ శిక్షణ  15 నుండి 25 కిలోమీటర్ల మేర సాగుతుంది.

వీపుపై 10 -15 కిలోల బరువున్న బ్యాక్‌ప్యాక్ ధరించి నడవాల్సి ఉంటుంది. ఈ శిక్షణ హృదయ స్పందన రేటును పరీక్షించడమే కాక‌ కండరాల ఓర్పును పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అడవి దట్టంగా ఉండటం వల్ల దారి తప్పిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే శిక్షణలో భాగంగా మ్యాప్ రీడింగ్, దిక్సూచి వాడకంపై కఠిన పరీక్షలు పెడతారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని సమయంలో  ప్రకృతి సంకేతాలను బట్టి దారిని ఎలా కనుగొనాలో నేర్పిస్తారు. ఇది మానసిక ఏకాగ్రతను పెంచుతుంది. బ్లాక్ ఫారెస్ట్‌లో ఎత్తైన శిఖరం ఫెల్డ్‌బర్గ్. ఇక్కడ ఇచ్చే శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది.

తక్కువ ఆక్సిజన్ స్థాయిల్లో నిటారుగా ఉండే కొండలను ఎక్కడంతో  ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగాల్సి ఉంటుంది. శిక్షణలో భాగంగా ఇక్కడ చేసే నైట్ ట్రెక్కింగ్ భ‌యాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇలాంటి క‌ఠిన‌మైన శిక్ష‌ణ మ‌హేష్ పొందుతున్నారు. దీంతో ఆయ‌న మే నెలంతా కూడా జ‌ర్మ‌నీలోనే ఉండే అవ‌కాశం ఉంది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్ రాజ‌మౌళితో  సినిమాలు చేసారు. ఆ సినిమాల  కోసం ఆ ముగ్గురు ఎంతో శ్ర‌మించారు. కానీ వారిని మంచి క‌ష్టం ఇప్పుడు మ‌హేష్ ప‌డుతున్నార‌న్న‌ది కాద‌న‌లేని నిజం.

Mahesh Working Hard For Varanasi