ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Who will play lead role in Haneef Adeni Next

ఆ నిర్మాత‌కు హీరో సెట్ అవ్వడం లేదా

Who will play lead role in Haneef Adeni NextWho will play lead role in Haneef Adeni Next

రాజుగారు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా? అన్న‌ట్లు దిల్ రాజు త‌లుచుకుంటే హీరోల‌కు కొద‌వా? ఆయ‌న పిలవాలే గానీ సినిమా చేయ‌ని హీరో ఎవ‌రుంటారు? ఎన్ని కోట్లు అయినా ఖ‌ర్చు చేయ‌గ‌ల నిర్మాత‌? మ‌రి అలాంటి నిర్మాత‌కు హీరో దొర‌క‌లేదు అంటే న‌మ్ముతారా? అప్పుడప్పుడు న‌మ్మ‌క త‌ప్ప‌ద‌ని ఈ నిజం తెలిస్తే అర్ద‌మ‌వుతుంది.

 

అవును రాజుగారికి ఇప్పుడు నిజంగానే హీరో స‌మ‌స్య త‌లెత్తింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఏంటా మ్యాట‌ర్ అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే... `మార్కో` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న హ‌నీఫ్ ఆదేనీ ని దిల్ రాజు లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. సౌత్ లో `మార్కో` భారీ విజ‌యం సాధించ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా రాజుగారు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసారు.

 

ద‌ర్శ‌కుడి వ‌ద్ద క‌థ సిద్దంగా ఉంది. కానీ  హ‌నీఫ్ రాసిన క‌థ‌కు హీరో సెట్ అవ్వ‌డం లేదుట‌. ఇదొక భారీ యాక్ష‌న్ స్క్రిప్ట్ కావ‌డంతో?  హీరో స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లు తెలుస్తోంది. భారీ కటౌట్ ఉన్న ఆ క‌థ‌కు అవ‌స‌రం అట‌. కానీ అలా ఉన్న క‌టౌట్లు అన్నీ ఇత‌ర సినిమాలో బిజీగా ఉన్నారు. మ‌హేష్‌, ప్ర‌భాస్ ల‌కు మాత్ర‌మే సెట్ అయ్యే స్టోరీ అట‌.

కానీ వారిద్ద‌రు  బిజీగా ఉన్నారు. మ‌రో మూడేళ్ల వ‌ర‌కూ దొరికే ఛాన్స్ లేదు. వారితో  కాకుండా మ‌రో న‌టుడితో చేస్తే బాగోదు అన్న‌ది ద‌ర్శ‌కుడి వెర్ష‌న్.  దీంతో రాజుగారు మ‌ధ్య‌లో లాక్ అయిన‌ట్లు తెలుస్తోంది.  

New Headache for Dil Raju

dil raju