Advertisement

హీరో కార్తి జపాన్ ఫస్ట్ లుక్

Mon 14th Nov 2022 07:12 PM
actor karthi,japan movie  హీరో కార్తి జపాన్ ఫస్ట్ లుక్
Karthi 25th film Japan first look హీరో కార్తి జపాన్ ఫస్ట్ లుక్
Advertisement

హీరో కార్తి - రాజు మురుగన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం జపాన్.  కార్తికి ఇది 25వ సినిమా. తాజాగా జపాన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు నిర్మాతలు. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీ గా వుంది. ఫస్ట్ లుక్ లో కార్తీ చేతిలో బాటిల్ పట్టుకొని, రెడ్ జంప్సూట్లో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించారు. కార్తి ఎదురుగా మందు గ్లాస్ తో సేదతీరున్న ఓ అమ్మాయి కూడా గమనించవచ్చు. ఇక సోఫా వెనుక గోడపై పెద్ద గోల్డెన్ ఫ్రేమ్ లో మరొక డిఫరెంట్ గెటప్ లో కనిపించారు కార్తి. బంగారు చొక్కా, మెడలో గొలుసులను ధరించి, ఒక చేతిలో బంగారు తుపాకీని మరో చేతిలో గోల్డెన్ గ్లోబ్ ని పట్టుకున్నట్లుగా కనిపించడం క్యూరియాసిటీని పెంచింది.

ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్ జోడి కడుతోంది. అల్లు అర్జున్ పుష్పలో మంగళం శీను పాత్రలో ఆకట్టుకున్న సునీల్ జపాన్ లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం.

Karthi 25th film Japan first look :

Actor Karthi 25th film Japan first look launch

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement