Advertisementt

నాని సినిమా సెట్ అంత కాష్ట్లీనా

Sun 18th Apr 2021 04:29 PM
nani,shyam singha roy,schedule in 6.5 cr,massive set,hyderabad  నాని సినిమా సెట్ అంత కాష్ట్లీనా
Shyam Singha Roy Final Schedule In 6.5 Cr Worth Massive Set In Hyderabad నాని సినిమా సెట్ అంత కాష్ట్లీనా
Advertisement
Ads by CJ

న్యాచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం శ్యామ్‌ సింగ రాయ్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.  ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ ఆడియన్స్‌లో సినిమా పట్ల మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తూ అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలను భారీగా పెంచేసింది.

తాజాగా ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల..కోల్‌కతాను త‌ల‌పించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో రీ క్రియేట్‌ చేశారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్‌తో ప‌ది ఎక‌రాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. హీరో నాని స‌హా ముఖ్యతారాగణంపై ప‌లు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  రేపు థియేట‌ర్‌ల‌లో ఈ స‌న్నివేశాలు సినీ ప్రియుల‌కి ఒక  కొత్త అనుభూతిని పంచ‌నున్నాయ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

ద‌ర్శ‌కుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ఓ యూనిక్‌ కాన్సెప్ట్‌తో శ్యామ్‌సింగ రాయ్‌ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త‌న గ‌త చిత్రాల‌కు భిన్న‌మైన స‌రికొత్త గెట‌ప్స్‌ల‌లో నేచుర‌ల్ స్టార్ నాని క‌నిపించ‌నున్నారు.

సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని

ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి రూపొందిస్తున్నారు.

Shyam Singha Roy Final Schedule In 6.5 Cr Worth Massive Set In Hyderabad:

Nani Shyam Singha Roy Final Schedule In 6.5 Cr Worth Massive Set In Hyderabad

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ