Advertisement

శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, బాలు అడుసుమిల్లి Y మోషన్ పోస్టర్

Sun 28th Feb 2021 05:57 PM
y movie,y (what is y ?)movie,y (what is y ?) latest telugu movie motion poster,adusumilli balu,shriram,rahul ramakrishna,balu adusumilli  శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, బాలు అడుసుమిల్లి Y మోషన్ పోస్టర్
Y Telugu movie motion poster శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, బాలు అడుసుమిల్లి Y మోషన్ పోస్టర్
Advertisement

శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, బాలు అడుసుమిల్లి Y మోషన్ పోస్టర్ విడుదల.. 

శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ ప్రధాన పాత్రలో బాలు అడుసుమిల్లి తెరకెక్కిస్తున్న విలక్షణ చిత్రం Y. ఏరుకొండ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో జక్కంపూడి గణేష్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. యేరుకొండ రఘురాం, శ్రీనివాస్ వేగి, మురళి మాటూరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బాలు. తెలుగు మోషన్ పోస్టర్ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. తమిళ మోషన్ పోస్టర్ ప్రముఖ హీరో ఆర్య విడుదల చేశారు. 

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. Y మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందని.. సినిమా ఇంకా ఆసక్తికరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ చెప్పారు నిర్మాత బన్నీ వాసు. రెండు భాషల్లోనూ ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. 

చోటా కె ప్రసాద్ ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దర్శన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. వికాస్ బడిస సంగీతం సమకూరుస్తున్నారు. Y చిత్రానికి వినయ్ కొట్టి మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు: శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్, టిఎన్ఆర్, జెమిని సురేష్, రఘు బాబు, కత్తి మహేష్..

టెక్నికల్ టీం: రచన - దర్శకత్వం: బాలు అడుసుమిల్లి, నిర్మాతలు:  యేరుకొండ రఘురాం, శ్రీనివాస్ వేగి, మురళి మాటూరు, బ్యానర్: యేరుకొండ ఎంటర్టైన్మెంట్, సమర్పణ: జక్కంపూడి గణేష్, ఎడిటర్: చోటా కె ప్రసాద్, సంగీతం: వికాస్ బడిస, సినిమాటోగ్రఫీ: దర్శన్, PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.

Y Telugu movie motion poster:

Shriram, Rahul Ramakrishna, Balu Adusumilli Y motion poster released

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement