Advertisement

27న 'జీ 5'లోకి 'మేక సూరి' మళ్ళీ వస్తున్నాడు!

Wed 25th Nov 2020 07:24 PM
meka suri 2 from november 27,zee5,  27న 'జీ 5'లోకి 'మేక సూరి' మళ్ళీ వస్తున్నాడు!
ZEE5 TO PREMIERE 'MEKA SURI 2' FROM 27th 27న 'జీ 5'లోకి 'మేక సూరి' మళ్ళీ వస్తున్నాడు!
Advertisement

నవంబర్ 27 నుండి 'జీ 5'లో 'మేక సూరి 2'. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్‌కి అద్భుత స్పందన

'జీ 5' ఓటీటీ ఒరిజినల్‌ తెలుగు వెబ్ ఫిలిం 'మేక సూరి' ప్రేక్షకులను మెప్పించింది. రియలిస్టిక్ అండ్ రా ఫిలింగా వెబ్ కంటెంట్ విషయంలో కొత్త ఒరవడి సృష్టించింది. గతంలో 'జీ 5' ఓటీటీలో ఇటువంటి జానర్‌లో వచ్చిన ఒరిజినల్‌ 'జీ 5' తెలుగు వెబ్ సిరీస్ 'గాడ్' (గాడ్స్ ఆఫ్ ధర్మపురి), ఒరిజినల్ 'జీ 5' తమిళ్‌ సిరీస్‌ ‘ఆటో శంకర్‌’ ఆడియన్స్‌ అప్లాజ్‌ అందుకున్నాయి. తెలుగు ప్రజల అభిరుచికి తగ్గట్టు అద్భుతమైన సిరీస్‌లు అందించే ఓటీటీ వేదికగా 'జీ 5' ప్రశంసలు అందుకుంటోంది. అచ్చమైన తెలుగు సిరీస్‌లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్‌ కంటెంట్‌తో వీక్షకులను అలరిస్తోంది. ఆల్రెడీ మంచి ప్రశంసలు అందుకున్న 'మేక సూరి' పార్ట్2ను ఈ నవంబర్ 27న విడుదల చేయనున్నట్టు 'జీ 5' తెలియజేసింది. ఇటీవల విడుదలైన ఈ ఒరిజినల్ మూవీ ట్రైలర్ కి అద్భుత స్పందన లభిస్తోంది. 

రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన 'రోబో' సినిమాను నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు శంకర్ దర్శకత్వం వహించిన 'నన్బన్' స్నేహితుడు సినిమాతో అసోసియేట్ అయిన కార్తీక్ కంచెర్లకు చెందిన సింబా ఎంటర్టైన్మెంట్ నిర్మించిన సిరీస్ 'మేక సూరి'. దీంతో ఓటీటీ ప్రపంచంలోకి కార్తీక్ కంచెర్ల అడుగుపెట్టారు. థియేటర్‌ ఆర్టిస్టులు సుమయ, అభినయ్‌ నటీనటులుగా పరిచయమయ్యారు. 'మేక సూరి'తో 'మోసగాళ్లకు మోసగాడు', 'ఒక్క క్షణం' సినిమాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా, 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' సినిమాకి అసిస్టెంట్‌ రైటర్‌గా పని చేసిన త్రినాధ్‌ వెలిసెల దర్శకుడిగా పరిచయమయ్యారు. 'మేక సూరి’ ఒరిజినల్ మూవీ లో తొలి పార్ట్‌తో ఆయనకు మంచి పేరు వచ్చింది. దాంతో రెండో పార్ట్ మీద అంచనాలు పెరిగాయి. వాటిని అందుకుంటామని యూనిట్ ధీమాగా చెబుతోంది.

కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు అన్నారు. అందులో సూరిది కసాయి (మేక తోలు వలిచి, మాంసం కొట్టే) వృత్తి. ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తున్న సూరి, అవలీలగా నిమిషాల్లో మేక తోలు వలిచి ముక్కలు కొట్టేస్తాడు. దాంతో అతడి పేరు ‘మేక’ అయిపోయింది. అతడి ఊరిలో రాణి అని అందమైన అమ్మాయి ఉంటుంది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ ఊరిలో మూతి మీద మీసం వచ్చిన కుర్రాడి నుంచి మీసాలకు రంగు వేసుకునే ముసలోళ్ల వరకూ అందరి కన్ను రాణి మీదే! మగజాతి మనసు దోచిన రాణి ఓ రోజు హత్యకు గురవుతుంది. ఆమెను చంపింది ఎవరు? అందుకు కారణమైన వ్యక్తులపై సూరి ఎలా పగతీర్చుకున్నాడనేది 'జీ 5'లో చూడాల్సిందే.

క్రైమ్‌ జానర్‌లో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఒరిజినల్ మూవీ ఇది! నవంబర్ 27న 'జీ 5'లో సెకండ్ పార్ట్‌ రిలీజ్‌ కానుంది. దీనికి ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీత దర్శకుడు. ఇంతకు ముందు కన్నడలో ‘సరోజ’ చిత్రానికి ఆయన సంగీతం అందించారు.

ZEE5 TO PREMIERE 'MEKA SURI 2' FROM 27th:

ZEE5 TO PREMIERE 'MEKA SURI 2' FROM NOVEMBER 27

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement