ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shirley Setia Finalized Naga Shaurya, Aneesh Krishna Movie

నాగ‌శౌర్య‌, అనీష్ కృష్ణ‌, `షర్లీ సేతియా`ను దింపారుగా.!

Shirley Setia Finalized Naga Shaurya, Aneesh Krishna MovieShirley Setia Finalized Naga Shaurya, Aneesh Krishna Movie

నాగ‌శౌర్య‌, అనీష్ కృష్ణ‌, ఐరా క్రియేష‌న్స్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన షర్లీ సేతియా.

హ్యాండ్స‌మ్ యాక్ట‌ర్ నాగ‌శౌర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఐరా క్రియేష‌న్స్ ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఇటీవ‌ల లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి జ‌ర‌గ‌నుంది. ఆక్లాండ్‌కు చెంది, ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌లో స్థానం పొందిన సంచ‌ల‌న గాయ‌ని, న‌టి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగ‌శౌర్య జోడీగా ఎంపిక‌య్యారు. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ 'మ‌స్కా'తో న‌టిగా మారిన షిర్లీ, త్వ‌ర‌లో 'నిక‌మ్మా' చిత్రంతో బాలీవుడ్‌లోనూ ప‌రిచ‌యం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కునిగా అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

హీరో హీరోయిన్లు: నాగ‌శౌర్య‌, షర్లీ సేతియా.

సాంకేతిక బృందం: బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌, స‌మ‌ర్ప‌ణ‌: శ‌ంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి, సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌, డిజిట‌ల్ హెడ్‌: ఎం.ఎన్‌.ఎస్‌. గౌత‌మ్‌, పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్, సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీ‌రామ్‌, స‌హ నిర్మాత‌: బుజ్జి, నిర్మాత‌: ఉషా ముల్పూరి, ద‌ర్శ‌కుడు: అనీష్ కృష్ణ‌.

Shirley Setia Finalized Naga Shaurya, Aneesh Krishna Movie

shirley setia
naga shaurya
aneesh krishna movie
ira creations