Advertisementt

బోగ‌న్ తొలి గీతం సింధూర

Fri 16th Oct 2020 01:04 PM
bogan movie,bogan movie first song,actor jayamravi,arvindswami,hansika  బోగ‌న్  తొలి గీతం సింధూర
Bogan first song was Sindhura బోగ‌న్ తొలి గీతం సింధూర
Advertisement
Ads by CJ

జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి ల బోగ‌న్  తొలి గీతం సింధూర ‌ విడుద‌ల‌

జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్ తో తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన బోగ‌న్  చిత్రాన్ని అదే పేరుతో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన‌ బోగ‌న్ తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్ కు అనూహ్య స్పంద‌న ల‌భించిన నేప‌థ్యంలో ఈ చిత్రం ఆడియో నుంచి సింధూర అనే పాటను విడుద‌ల చేశారు యూనిట్ స‌భ్యులు. త‌మిళ సెన్సేష‌న్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమామ్ ట్యూన్ చేసిన ఈ పాట‌ను తెలుగులో స‌మీర భ‌ర‌ధ్వాజ్ ఆల‌పించారు. అలానే భువ‌న‌చంద్ర ఈ పాట‌కు లిరిక్స్ అందించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ మా బ్యాన‌ర్ నుంచి బోగ‌న్ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చినప్ప‌టి నుంచి అటు ప్రేక్ష‌కుల నుంచి ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న లభిస్తోంది. బోగ‌న్ తెలుగు ట్రైల‌ర్ కు సైతం విశేష‌మైన రెస్పాన్స్ రావ‌డం మా టీమ్ అంద‌రికీ హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు విడుద‌ల చేసిన పాట కూడా ఆడియెన్స్ ను ఆక‌ట్టుకుంటుంది అని న‌మ్ముతున్నాను. మా సినిమాకు వస్తోన్న ఆద‌ర‌ణ చూశాక‌, ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నామ‌నే న‌మ్మ‌కం మ‌రింత‌గా పెరిగిందని నిర్మాత తెలిపారు. హీరోయిన్‌గా హ‌న్సికా మొత్వాని న‌టించిన ఈ చిత్రంలో నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, అక్ష‌ర గౌడ ఇత‌ర పాత్ర‌ధారులు. డి. ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. త్వ‌ర‌లోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ చెప్పారు.

తారాగ‌ణం: జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి, హ‌న్సికా మొత్వానీ, నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, నాగేంద్ర‌ప్ర‌సాద్‌, వ‌రుణ్‌, అక్ష‌ర గౌడ‌. కథ-  స్క్రీన్ ప్లే - ద‌ర్శ‌క‌త్వం: ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌:  రామ్ తాళ్లూరి, బ్యాన‌ర్‌: ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్.

Bogan first song was Sindhura:

Bogan first song was Sindhura

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ