‘జాగ్వార్’ నిఖిల్ ఫిల్మ్.. ‘రైడ‌ర్‌’ ఫ‌స్ట్‌లుక్

Nikhil Kumar, Vijay Kumar Konda’s Rider First Look And Motion Poster Out

Sat 12th Sep 2020 09:31 PM
rider first look,rider motion poster,nikhil kumar,vijay kumar konda,rider movie  ‘జాగ్వార్’ నిఖిల్ ఫిల్మ్.. ‘రైడ‌ర్‌’ ఫ‌స్ట్‌లుక్
Nikhil Kumar, Vijay Kumar Konda’s Rider First Look And Motion Poster Out ‘జాగ్వార్’ నిఖిల్ ఫిల్మ్.. ‘రైడ‌ర్‌’ ఫ‌స్ట్‌లుక్
Advertisement

నిఖిల్ కుమార్‌, విజ‌య్ కుమార్ కొండా కాంబినేష‌న్ ఫిల్మ్ ‘రైడ‌ర్‌’ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌ల‌

మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి. దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు యువ‌రాజా నిఖిల్ కుమార్ హీరోగా న‌టిస్తున్న నాలుగో చిత్రానికి ‘రైడ‌ర్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ల‌హ‌రి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై చంద్రు మ‌నోహ‌ర‌న్ నిర్మిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 11న శుక్ర‌వారం సాయంత్రం ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నిఖిల్ కుమార్ ప‌రుగెత్తుతూ క‌నిపిస్తున్నారు. ఆయ‌న యాక్ష‌న్ మోడ్‌లో ఉన్నార‌నీ, గూండాల‌ను చిత‌గ్గొడుతున్నార‌నీ వాళ్లు చెల్లాచెదురుగా కింద‌ప‌డిపోవ‌డం తెలియ‌జేస్తుంది. ‘రైడ‌ర్’ అనే టైటిల్‌కు పూర్తి న్యాయం చేస్తున్న‌ట్లుగా ఆ ఫ‌స్ట్ లుక్‌లో ఆయ‌న క‌నిపిస్తున్నారు.

ఫ‌స్ట్ లుక్‌తో పాటు విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్ మ‌రింత వివ‌రంగా హీరో చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్‌ను తెలియ‌జేస్తోంది. హీరో బాస్కెట్ బాల్‌ను విసిరేయ‌డం, ఆ త‌ర్వాత ర‌న్నింగ్ చేస్తూ గూడ్స్ కంటైన‌ర్ల మ‌ధ్య త‌న‌పైకి వ‌చ్చిన గూండాల‌ను ఉతికి ఆరేసిన‌ట్లు చూపించ‌డం క‌నిపిస్తోంది. ఈ సినిమాతో నిఖిల్ కుమార్ ఒక ఫెరోషియ‌స్ యాక్ష‌న్ హీరోగా మ‌న ముందుకు రానున్నార‌నే అభిప్రాయాన్ని ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ క‌లిగిస్తున్నాయి. ‘రైడ‌ర్‌’లో నిఖిల్ కుమార్ స‌ర‌స‌న నాయిక‌గా క‌శ్మీరా ప‌ర‌దేశి న‌టిస్తున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష ఎం. కుడువ‌ల్లి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణ‌మ‌వుతోంది.

తారాగ‌ణం:

యువ‌రాజా నిఖిల్ కుమార్‌, క‌శ్మీరా ప‌ర‌దేశి, ద‌త్త‌న్న‌, అచ్యుత కుమార్‌, రాజేష్ న‌ట‌రంగ‌, శోభ‌రాజ్‌, చిక్క‌న్న‌, శివ‌రాజ్ కె.ఆర్‌. పీట్‌, నిహారిక‌, సంప‌ద హుళివ‌న‌, అనూష‌

సాంకేతిక బృందం:

ర‌చ‌న‌: న‌ంద్యాల ర‌వి, విజ‌య్ ప్ర‌కాష్‌

డైలాగ్స్‌, కో-డైరెక్ట‌ర్‌: శ‌ర‌త్ చ‌క్ర‌వ‌ర్తి

మ్యూజిక్‌: అర్జున్ జ‌న్యా

సినిమాటోగ్ర‌ఫీ: శ్రీ‌ష ఎం. కుడువ‌ల్లి

ఎడిటింగ్‌: కె.ఎం. ప్ర‌కాష్‌

స్టంట్స్‌: డాక్ట‌ర్ ర‌వివ‌ర్మ‌

ఆర్ట్‌:  మోహ‌న్ బి. కెరే

క్రియేటివ్ హెడ్‌: సునీల్ గౌడ‌

నిర్మాత‌: చ‌ంద్రు మ‌నోహ‌ర‌న్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా

Nikhil Kumar, Vijay Kumar Konda’s Rider First Look And Motion Poster Out:

Rider First Look And Motion Poster released


Loading..
Loading..
Loading..
advertisement