పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు!!

Prabhas appreciates Paper Boy Trailer

Tue 28th Aug 2018 04:22 PM
prabhas,appreciates,paper boy trailer,sampath nandi  పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు!!
Prabhas appreciates Paper Boy Trailer పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు!!
Advertisement

పేప‌ర్ బాయ్ చిత్ర ట్రైల‌ర్ కు త‌న ప్ర‌శంస‌లు అంద‌చేసాడు యంగ్ రెబ‌ల్ స్టార్.. బాహుబ‌లి ప్ర‌భాస్. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత కాసేపు చిత్ర‌యూనిట్ తో ముచ్చ‌టించారు. 

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ.. ట్రైల‌ర్ మ‌రియు పాట‌లు లో మంచి విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. శోభ‌న్ గారు నా కెరీర్ కు వ‌ర్షం సినిమాతో తొలి విజ‌యాన్ని అందించారు.. అదే విధంగా ఇప్పుడు సంతోష్ కూడా విజ‌యం అందుకోవాల‌ని కోరుకుంటున్నాను. నా బిల్లా సినిమాకు ప‌ని చేసిన సౌంద‌ర్ రాజ‌న్ ఫోటోగ్ర‌ఫీ అద్బుతంగా ఉంది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ ఈ చిత్ర హ‌క్కుల్ని కొన‌డం మ‌రో మంచి ప‌రిణామం. సంప‌త్ నంది గారికి అంతా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ఇతర నిర్మాత‌ల‌కు కూడా నా విషెస్ తెలియ‌జేస్తున్నాను అని తెలిపారు. 

ప్ర‌భాస్ వ‌చ్చి త‌మ చిత్రానికి విషెస్ తెల‌ప‌డంతో పేప‌ర్ బాయ్ చిత్ర‌యూనిట్ ఆనందంలో తేలిపోతున్నారు. ఆగ‌స్ట్ 31న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 

న‌టీన‌టులు:

సంతోశ్ శోభ‌న్, రియాసుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యురామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు

సాంకేతిక విభాగం:

ద‌ర్శ‌కుడు: జ‌య‌శంక‌ర్

నిర్మాత‌లు: స‌ంప‌త్ నంది, రాములు, వెంక‌ట్ మ‌రియు న‌ర‌సింహా

నిర్మాణ సంస్థ‌లు: స‌ంప‌త్ నంది టీం వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా మ‌రియు ప్ర‌చిత్ర క్రియేష‌న్స్

సంగీతం: భీమ్స్ సిసిరేలియో

సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజన్ 

ఎడిట‌ర్: త‌మ్మిరాజు

ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ముర‌ళి మామిళ్ల 

స్క్రిప్ట్ కో ఆర్డినేట‌ర్: సుధాక‌ర్ పావులూరి 

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Prabhas appreciates Paper Boy Trailer:

Prabhas has showered his compliments on Paper Boy trailer


Loading..
Loading..
Loading..
advertisement