పండక్కొచ్చేందుకు పరుగులు పెట్టిస్తున్నారు!

Tue 15th Nov 2016 02:57 PM
shatamanam bhavathi,sankranthi race,shatamanam bhavathi shooting update,sharwanand  పండక్కొచ్చేందుకు పరుగులు పెట్టిస్తున్నారు!
పండక్కొచ్చేందుకు పరుగులు పెట్టిస్తున్నారు!
Sponsored links

నెలాఖరుకి  శర్వానంద్ - దిల్ రాజు ల శతమానం భవతి షూటింగ్ పూర్తి  

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం 'శతమానం భవతి'.  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2017 కి విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం గోదావరి జిల్లా అమలాపురం లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం టాకీ పార్ట్ నవంబర్ 18 కి పూర్తి అవుతుంది. నవంబర్ 28 కి పాటల తో సహా షూటింగ్ పూర్తి చేసుకుని, చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంటుంది. 

'శతమానం భవతి'  తాతా మనవళ్ల  మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. చిత్రం షూటింగ్ నెలాఖరుకి పూర్తవుతుంది. డిసెంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని, జనవరి లో సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది.. అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.  

ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి దర్శకత్వం : సతీష్ వేగేశ్న, ఎడిటింగ్: మధు, సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి, సంగీతం: మిక్కీ జె మేయర్, నిర్మాతలు : రాజు , శిరీష్  

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019