Advertisementt

బాల‌య్య కూడా ఫిక్స్ చేశాడు..!

Fri 29th Apr 2016 11:08 PM
chiranjeevi vs balakrishan,chiru 150 movie for sankranti,satakarni movie for sankranthi,balakrishna,chiranjeevi  బాల‌య్య కూడా ఫిక్స్ చేశాడు..!
బాల‌య్య కూడా ఫిక్స్ చేశాడు..!
Advertisement
Ads by CJ
చిరంజీవి సినిమాలు చేస్తున్నంత కాలం బాల‌య్య వ‌ర్సెస్ చిరు అన్న‌ట్టుగానే వుండేది. ఇద్ద‌రు క‌థానాయ‌కుల‌కూ మాస్‌లో బ‌ల‌మైన అభిమాన‌గ‌ణం వుంది. అందుకే ఇద్ద‌రూ కూడా పోటాపోటీగా సినిమాలు చేసేవారు. ఈసారి నువ్వైతే, వ‌చ్చేసారి నేను అన్న‌ట్టుగా విజ‌యాల‌తో క‌దం తొక్కేవారు. ఒకరికోసం మరొక‌రు టార్గెట్లు ఫిక్స్ చేసేసేవారు. కాంపిటీటివ్ స్పిరిట్ అంటే అలాగే వుండాలి మ‌రి. అయితే ఆ పోటీ మ‌ళ్లీ మొద‌ల‌య్యేలా క‌నిపిస్తోంది. చిరు రీ ఎంట్రీ సినిమా మొద‌లైన రోజే బాల‌య్య స్పందించాడు మ‌రి. చిరు 150వ సినిమాని ఈ రోజే ప్రారంభించారు. ఆ వేడుక‌లోనే సినిమాని వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో వెంట‌నే బాల‌య్య అండ్ కో నుంచి కూడా ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. బాల‌య్య న‌టిస్తున్న గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణిని కూడా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తున్న‌ట్టు ఆ చిత్రబృందం ప్ర‌క‌టించింది. దీంతో ఇద్ద‌రు క‌థానాయ‌కుల చిత్రాలు సంక్రాంతి పుంజుల్లాగా బ‌రిలోకి దిగుతున్న‌ట్ట‌య్యాయి. బాల‌య్య 100వ సినిమా వ‌ర్సెస్ చిరు 150వ సినిమా అన్న‌మాట‌. ఈ పందెంకోళ్లు  సంక్రాంతి బ‌రిలో ఎలా సంద‌డి చేస్తాయో చూడాలి. ఈ పోటీ రానురాను మ‌రింత పీక్స్‌కి వెళ్లేలా క‌నిపిస్తోంది. ఇలాంటి పోటీ సినిమా ఇండ‌స్ట్రీకి మంచిదే అని చెప్పొచ్చు. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ