Advertisement

నాగార్జున విలేజ్‌ గెటప్‌ కి వున్న విశేషమిదే!

Sat 19th Dec 2015 12:43 PM
soggade chinni nayana,soggade chinni nayana movie updates,nagarjuna,bangarraju,nagarjuna traditional look,kalyan krishna director  నాగార్జున విలేజ్‌ గెటప్‌ కి వున్న విశేషమిదే!
నాగార్జున విలేజ్‌ గెటప్‌ కి వున్న విశేషమిదే!
Advertisement

'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలోని బంగార్రాజు క్యారెక్టర్‌కి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నాన్నగారు చేసిన సినిమాలే ఇన్‌స్పిరేషన్‌ - కింగ్‌ నాగార్జున 

నటసామ్రాట్‌ డా|| అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసినప్పటికీ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన చేసిన సినిమాల్లో ఆయన గెటప్‌కి ఓ ప్రత్యేకత వుండేది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో అక్కినేని చేసిన సినిమాలన్నీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్కినేని నట వారసుడిగా కింగ్‌ నాగార్జున కూడా చాలా సినిమాల్లో విలేజ్‌ గెటప్‌లో కనిపించి ప్రేక్షకుల్ని, అక్కినేని అభిమానుల్ని అలరించారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్‌ నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో కూడా కింగ్‌ నాగార్జున పంచెకట్టుతో కనిపించబోతున్నారు. 

ఈ సినిమాలో కింగ్‌ నాగార్జున విలేజ్‌ గెటప్‌కి సంబంధించి ఒక విశేషం వుంది. అదేమిటంటే అక్కినేని నాగేశ్వరరావు పాత సినిమాల్లో వాడిన పంచెలను నాగార్జున గెటప్‌ కోసం ఈ సినిమాలో వాడడం జరిగింది. అలాగే 1959లో అక్కినేని నాగేశ్వరరావు కొనుగోలు చేసిన రిస్ట్‌ వాచ్‌ని ఈ సినిమాలో నాగార్జున ఉపయోగించారు. 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో తను చేసిన బంగార్రాజు క్యారెక్టర్‌ తనకెంతో సంతృప్తినిచ్చిన క్యారెక్టర్‌ అనీ, ఇలాంటి విలేజ్‌ గెటప్‌ చెయ్యడానికి నాన్నగారు చేసిన విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీసే తనకు ఇన్‌స్పిరేషన్‌ అనీ నాగార్జున చెప్తున్నారు. 

షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత అక్కినేని నాగార్జున. 

కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌ రచన: సత్యానంద్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement