అఖిల్ వాయిదాకు కారణం!

అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అఖిల్. ఈ సినిమాను అక్టోబర్ 22న దసరా కానుకగా విడుదల చేస్తామని చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చారు. అయితే నిర్మాత నిఖిల్ మాత్రం ఈ సినిమాను దసరా కు విడుదల చేయలేకపోతున్నామని చెప్పేశారు. గ్రాఫిక్స్ పనులు లేట్ అవ్వడం వలన రిలీజ్ డేట్ వాయిదా వేయాల్సి వచ్చిందని త్వరలోనే రిలీజ్ డేట్ ఖరారు చేసి తెలియజేస్తామని నితిన్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అసలు విషయానికొస్తే నాగార్జున సినిమా అవుట్ పుట్ మీద చాలా అసంతృప్తిగా ఉన్నాడట. సినిమాను టైం కు పూర్తి చేసినా.. గ్రాఫిక్స్ మాత్రం అనుకున్న విధంగా రాలేదని సమాచారం. దీంతో నాగార్జున, వినాయక్ గ్రాఫిక్స్ విషయంలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నారట. అందుకే రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేయాల్సివచ్చిందని తెలుస్తోంది..!

akhil akkineni
akhil movie postponed
nagarjuna
nithin