Advertisementt

పూజ హెగ్డే కి మళ్లీ నిరాశే

Mon 08th Dec 2025 03:45 PM
dhanush  పూజ హెగ్డే కి మళ్లీ నిరాశే
D55: Sai Pallavi replaces Pooja Hegde పూజ హెగ్డే కి మళ్లీ నిరాశే
Advertisement
Ads by CJ

బుట్టబొమ్మ పూజ హెగ్డే రెండుమూడేళ్ల బ్రేక్ తో మళ్లీ సౌత్ లో బిజీ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో జత కడుతున్న పూజ హెగ్డే కి సూర్య రెట్రో తో బిగ్ షాక్ ఇచ్చారు. కూలి మౌనిక స్పెషల్ సాంగ్ హిట్ అయినా ఆ సినిమా డిజప్పాయింట్ చెయ్యడంతో పూజ హెగ్డే కూడా నిరాశపడిపోయింది. 

ఇక ప్రస్తుతం విజయ్ లాస్ట్ మూవీ జాననాయగన్ తో పాటుగా తెలుగులో దుల్కర్ మూవీలో నటిస్తున్న పూజ హెగ్డే ధనుష్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది, D55 లో పూజ హెగ్డే ధనుష్ తో రొమాన్స్ చేయబోతుంది అనే ప్రచారం జరిగింది. దానితో పూజ హెగ్డే మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది, ఇకపై ఆమెకు తిరుగులేదు అనుకున్నారు. 

కట్ చేస్తే ధనుష్ పక్కన పూజ హెగ్డే కన్నా రౌడీ బేబీ అంటూ కాలుకదిపి యూట్యూబ్ ని షేక్ చేసిన సాయి పల్లవి అయితే బావుంటుంది అని మేకర్స్ భావిస్తున్నారట. అందులోను D55 ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ చేతులు మారడంతో హీరోయిన్ విషయంలో వారు ఫైనల్ గా సాయి పల్లవి ని సెలక్ట్ చేసారని తెలుస్తుంది. అలా పూజ హెగ్డే కి మరో నిరాశ ఎదురైనట్టే. 

D55: Sai Pallavi replaces Pooja Hegde:

Dhanush D55 undergoes a major overhaul as Sai Pallavi replaces Pooja Hegde

Tags:   DHANUSH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ